పదేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకుంటున్న ‘ఖుషి’ డైరెక్టర్

టాలీవుడ్‌లో ‘ఖుషి’ చిత్రం ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎస్.జె.సూర్య డైరెక్ట్ చేసిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఎస్.జె.సూర్య ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు. 2015లో తన చివరి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సూర్య, ఆ తర్వాత నటుడిగా కెరీర్‌ను తారాస్థాయికి తీసుకెళ్లాడు.

అయితే, ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ అనేందుకు సిద్ధమవుతున్నాడు ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్. తమిళంలో ‘కిల్లర్’ అనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఎస్.జె.సూర్య రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ఇందులో లీడ్ రోల్ కూడా తానే చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తాజాగా ప్రారంభించారు.

ఈ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇవ్వాలని ఎస్.జె.సూర్య ప్రయత్నిస్తున్నాడు. తమిళ నిర్మాత గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.

Exit mobile version