తమిళ హీరో శివకార్తికేయన్ రీసెంట్గా ‘మదరాసి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు హీరో శివకార్తికేయన్.
లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్లో ఓ పీరియాడిక్ చిత్రం చేస్తున్నాడు శివకార్తికేయన్. ‘పరాశక్తి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు పేర్కొన్నారు. దీంతో 2026 పొంగల్ బరిలో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంతో పోటీకి శివకార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలోకి దిగనుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ప్రేక్షకులు ఓటు వేస్తారో చూడాలి.