అరవై శాతం పూర్తైన శివాజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా

sivaji

తన సినిమాలు సక్సెస్ సాదించిన, ఫెయిల్ అయిన నటుడు శివాజీ మాత్రం హీరోగా, సహా నటుడిగా సినిమాలో నటిస్తూనే వున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న టైటిల్ లేని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు అరవై శాతం ముగిసింది. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ సరసన కైనజ్ (రాగిణి ఎంఎంఎస్ ఫేం)హీరోయిన్ గా నటిస్తోంది. గుణ శేఖర్ శిష్యుడు రేవన్ యాదు మొదటి సారిగా ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనున్నాడు. రమేష్ అన్న రెడ్డి, ప్రసాద్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాజ్ భాస్కర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version