నాకు రాజమౌలిలా సినిమా తీయాలని ఉంది – సింగీతం శ్రీనివాస్ రావు

సింగీతం శ్రీనివాస్ రావు ,తులసి మరియు అపర్ణ నాయర్ ప్రధాన పాత్రలలో రానున్న “చిన్ని చిన్ని ఆశ” చిత్ర ఆడియో గురువారం హైదరాబాద్లో విడుదల అయ్యింది. డా కిరణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ కార్యక్రమానికి సింగీతం శ్రీనివాస్ రావు ,కళ్యాణి సింగీతం,ఎస్ ఎస్ రాజమౌళి ఎం ఎం కీరవాణి, వి ఎం ఆదిత్య,తులసి,కోటి మరియు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్ళు దర్శకుడిగా ప్రేక్షకాదరణ పొందిన సింగీతం శ్రీనివాస్ రావు నటుడిగా చేస్తున్న ొలి చిత్రం ఇది.ఈ విషయమై అయన మాట్లాడుతూ “దర్శకనిర్మాతలు చెప్పిన కథ నాకు నచ్చింది అంతకన్నా వారిలో మంచి చిత్రాన్ని చెయ్యాలన్న తపన నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను” అని అన్నారు. రాజమౌళి గురించి చెప్తూ ” ఈగ చిత్రాన్ని చూసి మన తెలుగు పరిశ్రమలో ఇంత ప్రతిభగల దర్శకుడు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అయ్యాను నాకు అతనిలా చిత్రాన్ని తీయాలని ఉంది” అని అన్నారు.మూడు తరాల మధ్య ఒక అపార్ట్ మెంట్ నేపధ్యంలో జరిగే సున్నితమయిన ప్రేమ కథ ఇది అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కార్తిక్ ఎం సంగీతం అందించగా శ్రీనివాస్ గరిమెళ్ళ నిర్మించారు.

Exit mobile version