డేవిడ్ బృందంలో చేరిన శ్వేత పండిట్

డేవిడ్ బృందంలో చేరిన శ్వేత పండిట్

Published on Jul 7, 2012 10:45 PM IST


ప్రముఖ గాయిని శ్వేత పండిట్ కొత్త అవతారం ఎత్తడానికి సకలం సిద్దమయ్యింది. “లీడర్”, “కొత్త బంగారు లోకం”, “బద్రీనాథ్”, “పంజా”, “బాడీ గార్డ్” వంటి చిత్రాలలో పాటలు పాడి సంగీత ప్రేమికుల మనసుని గెలుచుకున్న ఈ భామ నటిగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డేవిడ్” లో విక్రం,జీవా,లారా దత్త, ఇషా శర్వానిలతో కలిసి తెరను పంచుకోనుంది. ఈ చిత్రంలో బిజోయ్ నంబియార్ ప్రతి పాత్రకి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు అది నాకు చాలా నచ్చింది ఈ పాత్ర కోసం నా వద్దకు రాగానే నేను ఒప్పుకున్నాను అని ఈ గాయిని ఒక ప్రముఖ పత్రికతో అన్నారు. ఈ చిత్రంలో విక్రం, డేవిడ్ అనే జాలరిగా కనిపించనున్నారు జీవ ఒక వాయిద్యకారుడిగా కనిపిస్తారు అతని పేరు కూడా డేవిడ్. రెండి విభిన్న కథలతో నడిచే కథ ఇది ఈ రెండింటిలో శ్వేతపండిట్ జీవా కథలో కనిపించనుంది. ఈ చిత్రం కోసం ఎనిమిది మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు వీరిలో ప్రసాద్ పిళ్ళై మరియు అనిరుధ్ కూడా ఉన్నారు.

తాజా వార్తలు