వెరైటీ నేపధ్యంలో సింగీతం సినిమా

వెరైటీ నేపధ్యంలో సింగీతం సినిమా

Published on Apr 2, 2013 12:15 AM IST

Singeetham-Srinivasa-Rao
వైవిధ్యమైన కధాంశాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘వెల్కమ్ ఒబామా’ అనే పేరుతో ఒక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో పశ్చిమగోదావరి జిల్లాలోని కోరుమామిడి అనే పల్లెలో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా నేపధ్యం అవార్డు గెలుచుకున్న ఒక మరాటీ సినిమా ‘మాల అయి వ్యాఃచి’ నుంచి తీసుకున్నది. సుర్రొగసి అనే అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సుర్రొగసి అంటే ఇతరుల కొరకు తాను బిడ్డను కను స్త్రీ. ఇది భారత చట్టం విదితమే. అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావుల బిడ్డ అలా జన్మించినదే. ఇదివరకు రవిబాబు ‘అమరావతి’ సినిమాలో ఈ నేపధ్యన్నే ఎంచుకున్నాడు.

‘వెల్కమ్ ఒబామా’ ఒక విదేశి బిడ్డకు ఈ విధంగా జన్మనిచ్చే తల్లి చుట్టూ తిరిగే కధ. మరాటి వెర్షన్లో ముఖ్య పాత్ర పోషించిన ఊర్మిళా ఖనిత్కర్ ఈ సినిమాలోనూ నటిస్తుంది. ప్రాంతానుసారంగా కధలో కొన్ని మార్పులు చేసారట. ఈ సినిమాలో తల్లి, పసిబిడ్డల నడుమ జరిగే సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయట. ఈ సినిమాలో బ్రిటిష్ నటులైన రాచెల్, సంజీవ్ మరియు నిరంజనిలు కుడా నటించారు. మిగిలిన చిత్రాన్ని హైదరాబాద్ మరియు ముంబైలలో షూట్ చేయనున్నారు. ఎస్ భారతీ కృష్ణా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘మాల అయి వ్యాఃచి’ రచించి, తెరకెక్కించిన సమృద్ధి తెలుగులో కధ, కధనాలకుగానూ సింగీతం శ్రీనివాసరావుకి సహాయం చేస్తున్నారు

తాజా వార్తలు