ఆ సినిమాకి సీక్వెల్ ఉండదన్న సింగీతం శ్రీనివాస రావు

ఆ సినిమాకి సీక్వెల్ ఉండదన్న సింగీతం శ్రీనివాస రావు

Published on May 5, 2013 9:30 PM IST

Singeetham-Srinivasa-Rao
చూస్తుంటే సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యేలా కనపడటం లేదు. ఇప్పటికే తను చేస్తున్న ‘వెల్ కమ్ ఒభామా’ సినిమా షూటింగ్ పూర్తి చేసారు. అది అలా అయ్యిందో లేదో తన తదుపరి సినిమాకి అప్పుడే సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది ఆయని 1987 లో వచ్చిన మూకీ సినిమా ‘పుష్పక విమానం’కి సీక్వెల్ తీయమని అడుగుతున్నారు. ఈ విషయాలకు సింగీతం శ్రీనివాస రావు తెరదించాడు. తను గతంలో తీసిన దేన్నీ మళ్ళీ తీయనని, అలాగే ‘పుష్పక విమానం’ సినిమాకి సీక్వెల్ అనేది ఉండదని తెలిపాడు. అలాగే తన తదుపరి సినిమా గురించి తెలిపాడు.’కొంతమంది ఆసక్తి కరమైన నటీనటులతో మ్యూజికల్ ఫిల్మ్ చేస్తున్నాను. ఇది అవుట్ అండ్ అవుట్ మ్యూజిక్ నేపధ్యంలో సాగే సినిమా. అలాగే ఇది ‘పుష్పక విమానం’ సినిమా అంత డిఫరెంట్ గా ఉంటుందని’ అన్నారు. ఈ సినిమాకి సంబందించిన త్వరలోనే తెలియజేసే అవకాశముంది.

తాజా వార్తలు