మరో ప్రయోగం చేయడానికి సిద్దమవుతున్న సింగీతం శ్రీనివాస్

Singeetham-Srinivasa-Rao

తను తీసిన ప్రతి సినిమా వైవిద్యంగా ఉండాలని కోరుకునే డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్. తను తీసే ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తు వుంటాడు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు కానీ తను వయసులో వున్న వారికి నచ్చే విదంగా సినిమాలను నిర్మిస్తూ వుంటాడు. అంతేకాదు ఇప్పటి ఆయన చాలా ఉత్సాహంగా పని చేస్తాడు. ప్రస్తుతం ఆయన తీసిన “వెల్ కం టు ఒబామా” సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆయన ఈ సినిమాకు పెట్టిన చూస్తుంటే ఆ పేరు ఎందుకు పెట్టాడా అని తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగుతుంది. ఈ సినిమాకు ఆయనే సంగీతాన్ని అందించాడు. నటి రాగిణి ఈ సినిమాకు మాటలను రాశారు. తను తరువాత తీయనున్నసినిమా కోసం బిజీగా వున్నాడు.ఇప్పటి వరకు ఎవరు తీయని విదంగా ఈ సినిమాని నిర్మించలని చూస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు ఎవరు చేయని విదంగా మొదట ప్రీ – రికార్డింగ్ పనులను పూర్తి చేయనున్నారు. రి – రికార్డింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ ప్రయోగంలో తను ఏవిదంగా విజయాన్ని సాదిస్తాడో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

Exit mobile version