తమిళ హీరో శింబు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన రీసెంట్గా కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా, శింబు పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక ఈ హీరో ఇప్పుడు కల్ట్ చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్లో తన నెక్స్ట్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
వెట్రిమారన్ చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆయన డైరెక్షన్లో శింబు చేయబోయే సినిమా కోసం హీరో తన డెడికేషన్ చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ సినిమాలో శింబు పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని.. అందుకోసం ఏకంగా పది రోజుల్లో 10 కిలోల బరువు తగ్గాడట ఈ హీరో.
ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇలా తన పాత్ర కోసం శింబు చూపిస్తున్న డెడికేషన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. మరి ఇంత డెడికేషన్ చూపిస్తున్న శింబు ఈ సినిమాతో సరైన సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.