తమిళ నటుడు శింబు మరియు హన్సిక ఒకరినొకరు ప్రేమించుకుంటునట్టు అధికారికంగా తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరి నటులమధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తుందని, అది త్వరలో వివాహానికి దారితీస్తుందని పలు వార్తాపత్రికలు వెల్లడించాయి. వారిగురించి వస్తున్న వార్తలకు విసిగిపోయిన ఈ తారలు అధికారికంగా మేము ప్రేమలో ఉన్నామని, మరెటువంటి పుకార్లను పుట్టించకండి అని తెలిపారు
“న వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న పలు పుకార్లను చూస్తున్న నేను కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నా.. అవును నేను ఎస్ టిఆర్ ను ప్రేమిస్తున్నా. ఇక నా వ్యక్తిగత విషయాలను చెప్పదలుచుకోలేదు “అని హన్సిక ట్వీట్ చేసింది. మరోపక్క తెలుగు తమిళ భాషల్లో ప్రముఖుడైన శింబు వారి కుటుంబం పెళ్లి చేసుకోమని అడుగుతున్నారట. “అవును నేను హన్సికను ప్రేమిస్తున్నాను. పెళ్లి మొదలగు విషయాలు మా కుటుంబాలు నిర్ణయిస్తాయి. మా ప్రైవసీకు భంగం కలిగించరని ఆశిస్తున్నా”అని ట్వీట్ చేసాడు. వీరిద్దారు వారి వారి ప్రాజెక్ట్లలో బిజీగా వున్నారు. వీరిపెళ్లి ఎప్పుడన్న విషయం ఇంకా ఖరారు కావాల్సివుంది. ప్రస్తుతం హన్సిక మంచు వారి మల్టీ స్టారర్ సినిమాలో మరియు మరో రెండు తమిళ సినిమాలలో నటిస్తుంది