‘మన్మధ’ సినిమాతో తెలుగు వారికి పరిచయమున్న తమిళ్ హీరో శింబుకి హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడపడంలో కూడా మంచి పేరుంది. గతంలో ‘వల్లభ’ సినిమా టైంలో నయనతారతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకోవాలనుకొని కూడా విడిపోయారు. తాజాగా ‘వాలు’ అనే తమిళ్ సినిమా చేస్తున్న శింబు ఆ సినిమా హీరోయిన్ హన్సికతో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయాన్ని హన్సిక కూడా ఖరారు చేసింది. కానీ శింబు నయనతారతో సినిమా చేయడం మొదలు పెట్టినప్పటి నుండి శింబు – హన్సిక విడిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలకి శింబు తెర దించేసాడు. చెన్నైలో ఈ రోజు ఉదయం ఓ కార్య క్రమంలో మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ ఉన్న రిలేషన్ షిప్ కి పుల్ స్టాప్ పెట్టేసాను. ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను. అసలు హన్సికకి నాకు ఏం జరిగింది అని వదిలేయండి. ఎందుకంటే అది గతం. ఈ విషయం నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ నా ఫ్రెండ్స్, అసోషియేట్స్, నా అభిమానులకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్పాను. ఈ విషయం చెప్పేసాక భారం అంతా దిగిపోయింది, ఇప్పుడు హ్యాపీ గా ఉన్నాను. ప్రస్తుతం నా దృష్టి అంటా కెరీర్ పైనే అని’ అన్నాడు.