గౌతం మీనన్ ప్రస్తుతం తన రాబోవు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే ఇప్పుడు తీస్తున్న సినిమా ‘విన్నైతాండి వరువాయ'(తెలుగులో ఏమాయ చేసావె) కు సీక్వెల్ గా తీసున్నది కాదని తెలియజేశారు. ఇది శింబు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్క్రిప్ట్ అని అన్నాడు. .
గౌతం మీనన్ రొమాంటిక్ యాక్షన్ సినిమాలు తీయడంలో మంచి పేరుంది. ‘కఖ కఖ'(ఘర్షణ), చెలి, సూర్య ఎస్/ ఓ కృష్ణన్, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో అందరి ప్రశంసలు పొందాడు. అలాంటి తను రన్బీర్ కపూర్ గురించి మాట్లాడాడు. “అతను మంచి నటుడు, తనకు కథలను ఎన్నుకోవడం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని అలాగే దక్షిణన శింబు కుడా రన్బీర్ కపూర్ లాంటి వాడని అన్నాడు. ఈ సినిమా కథ పూర్తిగా వినకుండానే ఈ సినిమాకి శింబు సంతకం చేశాడని సమాచారం,
ఈ సినిమాలో శింబు సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫోటాన్ కథాస్ బ్యానర్ పై ఈ సినిమాని గౌతం మీనన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత అజిత్ తో సినిమా ప్రారంభమవుతుంది.