ఏప్రిల్ 19న విడుదలకానున్న ఎన్.హెచ్ 4

NH4-Movie

సిద్దార్థ్ మరియు ఆశ్రితా శెట్టి జంటగా నటిస్తున్న ‘ఎన్.హెచ్ 4’ సినిమా ఈనెల 19న విడుదలకు సిద్దంగావుంది. మణిమారన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు వేత్రిమారాన్ కధ,కధనం మరియు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. బి. సుబ్రమణ్యం మరియు సురేష్ ఈ సినిమాని లక్ష్మి గణపతి బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు ఈసినిమా గురించి మాట్లాడుతూ “మొదటిసారి యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సిద్దార్థ్ సినిమాలలో ఇది మేటి చిత్రంగా మిగిలిపోతుంది. పాటలకు మార్కెట్లో ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఒక పాటను సిద్దార్ధ్ స్వయంగా పాడటం విశేషం. బెంగుళూరు, చెన్నై మధ్య రహదారిలో మొత్తం సినిమా నడుస్తుందని”తెలిపారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్ బాషలలో ఒకేసారి విడుదలచేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీతదర్శకుడు. వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version