సిద్దార్థ్ తన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఏటకి ఎంటర్ టైన్మెంట్స్ లో మరో ద్విభాషా చిత్రంలో నటించి నిర్మించనున్నారు.ఈ చిత్రం ఒక ప్రేమ కథగా ఉండబోతుది ఈ చిత్రాన్ని రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నిర్మించానున్నారని సమాచారం. ఈ చిత్రం నవంబర్ లో మొదలు కానుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటీ నట వర్గాలు మరియు హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన త్వరలో చెయ్యనున్నారు. ఈ ఏడాది ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన “లవ్ ఫైల్యూర్” చిత్రం కాస్త లాభాలు తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.