దాదాపుగా పూర్తయిన సిద్దార్థ్- సమంతల చిత్రం

దాదాపుగా పూర్తయిన సిద్దార్థ్- సమంతల చిత్రం

Published on Nov 14, 2012 9:50 PM IST

నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సిద్దార్థ్ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. సమంత కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సమంత ముస్లిం యువతీ పాత్రలో కనపడనుంది అని సమాచారం. నిత్య మీనన్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే సిద్దార్థ్ మరియు సమంతల మీద అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక పాట చిత్రీకరణ జరిపారు. చిత్రంలో ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయినట్టు సిద్దార్థ్ తెలిపారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. “అలా మొదలైంది” చిత్రం తరువాత నందిని రెడ్డి చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు