హైదరాబాదులో సిద్ధార్థ్ – సమంతా చిత్ర షూటింగ్

హైదరాబాదులో సిద్ధార్థ్ – సమంతా చిత్ర షూటింగ్

Published on Mar 14, 2012 10:11 AM IST


ఇటీవలే లవ్ ఫెయిల్యూర్ సినిమాతో విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ తరువాత చిత్రం నందిని రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. కావూరి హిల్స్ లోని చాక్లెట్ రూంలో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో సిద్ధార్థ్, సమంతా మరియు పలువురు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. గతంలో ‘అలా మొదలైంది’ సినిమాతో విజయం అందుకున్న నందిని రెడ్డికి ఇది రెండవ చిత్రం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు