సంథింగ్….సంథింగ్ తో అతని కల ఫలించేనా?

సంథింగ్….సంథింగ్ తో అతని కల ఫలించేనా?

Published on Jun 1, 2013 3:20 PM IST

siddharth

తెలుగు తెరకు మరిచిపోలేని హిట్లు ఇచ్చిన టాలెంటెడ్ హీరో సిద్ధార్ధ్ ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా రాణించలేకపోతున్నాడు. అతను నటించిన హిందీ సినిమా ‘చష్మే బద్ధుర్’ భారీ విజయం సాధించినా తెలుగులో అతనికి ఒక సరైన హిట్ పడాల్సివుంది. అతని గత చిత్రాలు ‘జబర్దస్త్’, ‘NH4’ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు అతను త్వరలో విడుదలకాబోతున్న ‘సంథింగ్…సంథింగ్’ పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు.

సిద్దార్థ్, హన్సికలు జంటగా నటిస్తున్నఈ స సినిమా మరోవారంలో సెన్సార్ పూర్తిచేసుకుని జూన్ 14న విడుదలకు సిద్ధంగా వుంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడు. కుష్బూ నిర్మాత. ఈ చిత్రం యొక్క తెలుగు అనువాద హక్కులను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో గణేష్ వెంకటరామన్, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో, హీరొయిన్లు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తారు. బ్రహ్మానందం తోడుతో సిద్ధార్ద్ హిట్ కొడతాడేమో చూద్దాం

తాజా వార్తలు