విక్కి డోనార్ రీమేక్ హక్కుల కొనుగోలు ఆలోచనలో సిద్దార్థ్

విక్కి డోనార్ రీమేక్ హక్కుల కొనుగోలు ఆలోచనలో సిద్దార్థ్

Published on May 5, 2012 7:24 PM IST


అన్ని సరిగ్గా జరిగితే “విక్కి డోనార్” రీమేక్ లో ఆయుష్మాన్ కుర్రాన పాత్రలో సిద్దార్థ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలివుడ్ లో తాజా సమాచారం ప్రకారం సిద్దార్థ్ ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం జాన్ అబ్రహంతో చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనే ఈ పాత్రలో నటిస్తున్నారా? లేక నిర్మాతగానే ఉండిపోతారా? అన్నది ఇంకా తెలియరాలేదు. “విక్కి డోనార్” చిత్రం సిద్దార్థ్ కి బాగా నచ్చినట్టు ఉంది తెలుగు మరియు తమిళంలో కూడా ఈ చిత్రం విజయం సదిస్తుందని సిద్దార్థ్ అనుకుంటున్నారు. ఈ నెలలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం మణికంఠన్ దర్శకత్వంలో ఒక చిత్రం మరియు నందిని రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు