చాలా విషయాల్లో న్యాయం జరిగనప్పుడు స్పందించే హీరో సిద్దార్థ్ ఈ సారి సెన్సార్ బోర్డ్ పై ధ్వజమెత్తారు. ‘ నా రాబోయే సినిమాలో నా పాత్ర కొతమంది లాయర్లు లంచాలు తీసుకుంటున్నారు, కొంతమంది దొంగ స్వామీజీలు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పే సీన్ ని సెన్సార్ కట్ చేసిందని’ సిద్దార్థ్ తన ట్విట్టర్లో తెలిపాడు. అలాగే ‘ ఫిల్మ్ మేకర్స్ అంతా ఒకటిగా కలిసి ఈ సెన్సార్ షిప్ కి కొన్ని రూల్స్ పెట్టేంత వరకూ సెన్సార్ వారి ఈ సిల్లీనెస్ కి అంతముండదు. ఒక్కొక్కరుగా వెలుతున్నంత సేపు మన క్రియేటివ్ సీన్స్ పై వారి దాడి కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇది మాత్రం సిస్టమిక్ సమస్య కాదు. భాదాకరమైన విషయం’ అని కూడా అన్నాడు.
ఇప్పటికే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సెన్సార్ బోర్డులో జరుగున్న అవకతవకల పై ధ్వజమెత్తారు, ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా హీరో సిద్దార్థ్ వచ్చి చేరాడు. సిద్దార్థ్ త్వరలోనే నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జబర్దస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న రిలీజ్ కానుంది.