‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తి గ్యాంగ్‌స్టర్ చిత్రంగా మేకర్స్ రూపొందించారు. ఇక ఈ సినిమా నుంచి వరుస ప్రమోషనల్ కంటెంట్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ రానుందని.. ఇది ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ అప్డేట్ ఎప్పుడు రానుందనే విషయాన్ని చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా రివీల్ చేశాడు. ఓజి నెక్స్ట్ అప్డేట్ ఏమిటో తెలియాలంటే రేపు(సెప్టెంబర్ 14) ఉదయం 10.08 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అని ఆయన అన్నారు.

దీంతో ఈ సినిమా నుంచి రాబోయే నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు ఓజి.

Exit mobile version