కథా పరంగానే సినిమాలు ఎంచుకుంటాను – శృతి హాసన్

Shruti_Haasan

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్ర పోషించింది. శృతి హాసన్ పోషించిన అమ్ములు పాటకి మంచి రెస్పాన్స్ రావడంతో తన ఆనందాన్ని షేర్ చేసుకోవడం కోసం ఓ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

శృతి హాసన్ మాట్లాడుతూ ‘ ముందుగా అమ్ములు లాంటి మంచి పాత్రని నాకిచ్చిన హరీష్ శంకర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. సినిమాలో అందరూ బాగా చేసారు. సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ఎన్.టి.ఆర్ మంచి డాన్సర్. కానీ ఈ మూవీలో ఆయనతో డాన్సులు చేసే చాన్స్ రాలేదు. నా పాత్రకి చాలా మంది నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే అందరూ హీరోయిన్ గా బిజీగా ఉన్న మీరు ఎందుకు ప్రత్యేక పాత్ర చేసారు అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మాములుగా నేను సినిమాలో 5 సీన్స్ లో ఉన్నానా లేక 5 డైలాగ్స్ చెప్పానా అనేది చూడను. నేను కథ విన్నప్పుడు ఆడియన్స్ ఎలా చూస్తారు అనేది మాత్రమే ఆలోచిస్తాను. ముఖ్యంగా కథా పరంగానే సినిమాలను ఎంచుకుంటాను. నాకు అమ్ములు పాత్ర చాలా బాగా నచ్చింది. అలాగే సినిమాకి చాలా కీలకమైన పాత్ర. ఇవన్నీ కాకుండా హరీష్ శంకర్ గారితో ఉన్న మంచి రిలేషన్ కూడా ఈ సినిమా చేయడానికి ఒక కారణమని’ తెలిపింది.

హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ నేను అమ్ములు పాత్ర కోసం శృతిని అనుకున్నప్పుడు తను చేస్తుందో లేదో అనుకున్నాడు. కానీ తనకి చెప్పగానే చేస్తానని ఒప్పుకుంది. ఈ విషయంలో తనకి థాంక్స్ చెబుతున్నాను. సినిమా మొదటి రెండు రోజులు కాస్త నెగటివ్ టాక్ వచ్చినా ఇప్పుడు సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని’ అన్నాడు.

Exit mobile version