గత కొన్ని రోజులుగా శృతిహాసన్ తనను తాను మార్చుకున్న విధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ నటించిన చాలా సినిమాలలో మన పక్కింటి అమ్మాయిలాంటి పాత్రలో కనిపించడంవల్ల ఆమెకు తన అందాలను చూపించే అవకాశం రాలేదు. కానీ ఈమధ్య జరిగిన రెండు వేడుకల మూలాన ఆమెలో ఊహించలేనటువంటి మార్పు చోటుచేసుకుంది.
అందులో మొదటిది మాక్సిం మేగ్జీన్ కవర్ పేజికుగానూ ఆమె నిర్వహించిన ఒక హాట్ ఫోటో షూట్. దీని మూలంగా శృతి హాసన్ కు ట్విట్టర్లో ఆమె అభిమానులనుండి కొన్ని వేల ట్వీట్లు, పోస్ట్ లు వచ్చాయి. మరొకటి ఈ రోజు ఆమె త్వరలో ‘డి-డే’ అనే హిందీ సినిమాలో నటిస్తానని తెలుపడమేకాక తాను అందులో వేశ్య పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. “‘డి-డే’ సినిమా పోస్టర్ కు మీరిచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు. ఇందలో నేను నాకు ఇష్టమైన, కాస్త కష్తమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాన “ని ట్వీట్ చేసింది.
ఇదిలా వుంటే ఆమె తెలుగులో ‘బలుపు’ ద్వారా గ్లామర్ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ఆమెతో పటు రవితేజ మరియు అంజలి నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదలకానుంది. ఇదే కాకా శృతి హాసన్ నటిస్తున్న ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్య’ సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకానున్నాయి