శ్రుతి హాసన్ భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది : పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో తనకు జోడీగా నటించిన శ్రుతి హాసన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రుతి హాసన్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” శ్రుతి సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న అమ్మాయి అని మరియు వృత్తిపట్ల ఎంతో నియమ నిబద్దతలు కలిగి ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు శ్రుతికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదని, ‘గబ్బర్ సింగ్’తో తనకి ఆ అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. శ్రుతి భవిష్యత్తులో అగ్ర కథానాయికగా వెలుగొందుతుందని ఆయన అన్నారు’. ‘గబ్బర్ సింగ్’ రేపటితో 50 రోజుల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకోనుంది.

ఇప్పటికే ఈ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా చేరిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం అందించిన విజయంతో పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

Exit mobile version