విశాల్ తో జతకట్టనున్న శృతిహాసన్?

shruti_vishal
కోలీవుడ్ సమాచారం ప్రకారం శృతిహాసన్ కాస్త విరామంతరువాత తమిళ సినిమాలో కనిపించనుంది. ఆమె చివరిసారిగా ధనుష్ తో కలిసి ‘3’ సినిమాలో నటించింది. ఆ తరువాతనుండి ఈ భామ తెలుగు, హిందీ ప్రాజెక్ట్ లలో బిజీగా వుంది.

ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే శృతి విశాల్ తో కలిసి 2014లో ఒక సినిమాలో నటిస్తుందట. హరి ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా ఈ వార్త అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం శృతి ‘రేస్ గుర్రం’, ‘వెల్కమ్ బ్యాక్’ సినిమాలతో బిజీగా వుంది. వీటిలో సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా వెల్కమ్ బ్యాక్ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది.

Exit mobile version