రేపటి నుంచి ఎన్.టి.ఆర్ టీంతో కలవనున్న శృతి హాసన్

రేపటి నుంచి ఎన్.టి.ఆర్ టీంతో కలవనున్న శృతి హాసన్

Published on Jun 6, 2013 1:54 PM IST

shruti-hassan
అందాల భామ శృతి హాసన్ ‘రామయ్యా వస్తావయ్యా’ టీంతో కలవనుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ బెంగుళూరు – మైసూర్ ప్రాంతంలో షూటింగ్ చేస్తన్నారు. రేపటి నుంచి శృతి హాసన్ ఈ చిత్ర టీంతో జాయిన్ కానుంది. ఈ అందాల భామ ‘బలుపు’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది.

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎక్కువ భాగం సెప్టెంబర్ చివర్లో ఉండే అవకాశం ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లను రామ్ – లక్ష్మణ్ సోదరులు కంపోజ్ చేస్తున్నారు

తాజా వార్తలు