శృతిహాసన్ తనవంతు సామాజిక సాయం అందించాలనే భావనతో ‘శిక్ష’ అనే పేరుతొ పి&జి సంస్థతో చేయికలిపింది. దిగువదారిద్ర్య రేఖన వున్న పిల్లలకు చదువు చెప్పేందుకు కావాల్సిన నిధులకోసం ఈ సంస్థ గతకొన్నాళ్ళుగా ప్రయత్నిస్తుంది
సన్నీ డియోల్, నేహా దుఫియా, అనీల్ కుంబ్లే వంటి ప్రముఖులు ఈ సంస్థతో చేయికలిపారు. ఇప్పుడు ఈ జాబితాలో శృతి కూడా చేయికలిపింది. ఈరోజు ఈ భామ విద్యావంతి జెడ్.పి హై స్కూల్ కు వెళ్లి అక్కడ పిల్లలతో ముచ్చటించింది. వీరితో గడపడం చాలా ఆనందంగా వుందని హైదరాబాద్ వచ్చిన ఈ భామ ట్వీట్ చేసింది
గబ్బర్ అనే హిందీ సినిమాలో త్వరలో నటించనుంది. రేస్ గుర్రం సినిమాలో ఈ భామ తన పార్ట్ ను ముగించుకుంది. ఈ సినిమా వేసవిలో విడుదలకానుంది