రవితేజ బలుపు స్టార్టయ్యింది

రవితేజ బలుపు స్టార్టయ్యింది

Published on Nov 17, 2012 10:22 PM IST


రవితేజ నెక్స్ట్ సినిమా బలుపు ఇటీవలే ముహుర్తం జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుండే స్టార్ట్ చేసారు. రవితేజ, శృతి హాసన్ మీద కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. శృతి హాసన్ నటిస్తున్న సినిమాల్లో గబ్బర్ సింగ్ తరువాత రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ టీంతో మొదటి రోజు షూటింగ్లో పాల్గొనడం కొత్తగా ఉందని శృతి హాసన్ తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఆమెతో పాటుగా అంజలి మరో హీరొయిన్ గా నటిస్తుంది. డాన్ శీను తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. పీవీపీ బ్యానర్ పై ప్రసాద్ పొట్లూరి ఈ సినిమాని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు