హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు నుంచే శృతి హాసన్ రంగంలోకి దిగేసింది. ఈ రోజు నుంచి శృతి హాసన్ హిందీ ‘గబ్బర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాకి రీమేక్. హిందీలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నాడు.
ఈ వారం మొదట్లో శృతి హాసన్ అపెండిసైటిస్ సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ‘ముంబై కి వచ్చాను, షూట్ కి వచ్చేసాను.. బై బై అపెండిక్స్.. హలో న్యూ ఇయర్ 🙂 నాకు నొప్పి అంటే ఇష్టం లేదని’ గబ్బర్ షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టాక శృతి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గత సంవత్సరం తను చేసిన ‘డి – డే’ సినిమా తర్వాత వరుసగా బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. తను చేస్తున్న వెల్ కమ్ బ్యాక్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది, అలాగే గబ్బర్ సినిమా షూటింగ్ మొదలైంది.
ఇది కాకుండా శృతి హాసన్ రామ్ చరణ్ సరసన నటించిన ‘ఎవడు’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే అల్లు అర్జున్ సరసన రేసు గుర్రం సినిమాలో నటిస్తోంది.