సి.సి.ఎల్ లో అడుగుపెట్టిన శృతి హాసన్

సి.సి.ఎల్ లో అడుగుపెట్టిన శృతి హాసన్

Published on Jan 20, 2013 4:55 PM IST

Shruthi
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మూడవ ఎడిషన్ ఇంతక ముందు కంటే మెరుగైన టెక్నాలజీతో త్వరలోనే మొదలుకానుంది. ఈ సారి తెలుగు వారియర్స్ టీంలో రామ్ చరణ్ కూడా ఆడనున్నారని నిన్ననే మీకు తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్లో అందాల భామ శ్రుతి హాసన్ కూడా పాల్గోనబోతోంది. చెన్నై రైనోస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా శృతి హాసన్ వ్యవహరించనుంది. గత సంవత్సరం చెన్నైకి సమీర రెడ్డి, అమలా పాల్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించారు.

‘ చెన్నై రైనోస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా గౌరవం గా ఉంది. టీంలో సూపర్బ్ బాయ్స్ ఉన్నారు’ అని శృతి ట్వీట్ చేసింది. చెన్నై రైనోస్ ని హీరో విశాల్ లీడ్ చేయనున్నాడు. సి.సి.ఎల్ ఫిబ్రవరి 9న కొచ్చిలో ప్రారంభం కానుంది.

తాజా వార్తలు