స్విస్ లో ఫ్లూ జ్వరంతో బాధపడుతున్న శృతిహాసన్

shruti-haasan
ప్రస్తుతం స్విట్జర్ల్యాండ్ లో ఉన్న శృతి హాసన్ ఫ్లూ జ్వరం కారణంగా కష్టకాలంలో వుంది. ‘రేస్ గుర్రం’ సినిమాలో ఒక పాత చిత్రీకరణకై ఈ నెల మొదట్లో జెనివా వెళ్ళింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో. సురేందర్ రెడ్డి దర్శకుడు. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగానే ఆమె ఈ విధంగా ట్వీట్ చేసింది. “ఫ్లూ జ్వరంతో స్విట్జర్లాండ్లో షూటింగ్ ఉన్నా… అందాన్నీ , యాంటి బయోటిక్ ని ఒకేసారి చూస్తున్నా… స్విస్ లాంటి ప్రదేశంలో సైతం నేను ఒంటరిగా ఉండిపోతున్నా” అని సెలవిచ్చింది. ఈ భామ యూరోప్ లో ఉన్నంతకాలం తగు జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇచ్చారు. అల్లు అర్జున్ తో మొదటిసారిగా జత కడుతున్న ఈ భామ మనకు కంప్లీట్ ఎంటర్టైనర్ ను ఇవ్వడానికి సిద్ధమవుతుంది. థమన్ సంగీత దర్శకుడు

Exit mobile version