గత కొద్ది రోజులకు ముందు ముంబైలోని శృతి హసన్ అపార్ట్ మెంట్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె నటిస్తున్న హిందీ సినిమా ‘వెల్ కం బ్యాక్’ కోసం మళ్ళి షూటింగ్ కి హాజరు కానున్నారు. ఈ మధ్య సినిమాకి సంబందించిన కొన్ని సన్నివేశాలను ముంబైలో షూట్ చేయడం జరిగింది. ఆ తరువాత లాంగ్ షెడ్యూల్ కోసం ఈ సినిమా నటి నటులు దూబాయికి వెళ్ళడం జరిగింది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ సినిమాలో శృతి హసన్ జాన్ అబ్రహం, నానా పటేకర్, అనిల్ కపూర్ లతో కలిసి నటిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సంవత్సరం ఆమె నటించిన సినిమాలు మిక్సుడు హిట్ సాదించాయి. శృతి హసన్ నటించిన ‘బలుపు’, ‘డీ- డే’ సినిమాలకు మంచి రెస్పాన్ లబించగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రామయ్యా వస్తావయ్యా’ అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు ఆశించినంత విజయాన్ని సాదించలేక పోయాయి. తాను నటించిన ‘ఎవడు’, ‘రేసు గుర్రం’ సినిమాలు 2014 జనవరి, ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.