ఎన్.టి.ఆర్ మూవీ సెట్లో సందడి చేస్తున్న శ్రుతి హాసన్

ఎన్.టి.ఆర్ మూవీ సెట్లో సందడి చేస్తున్న శ్రుతి హాసన్

Published on Feb 11, 2013 10:52 PM IST

ShrutiHassan
హరీష్ శంకర్ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతి హాసన్ ఒక కీలక పాత్ర పోషించనుందని గత వారం హరీష్ శంకర్ అధికారికంగా తెలిపాడు, అందులో భాగంగానే ఈ రోజు నుంచి శ్రుతి ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. ఈ సినిమా కోసం శ్రుతి మీద ఒక ఫొటోషూట్ కూడా చేసారు మరియు హరీష్ శంకర్ సినిమాలో రెండవ సారి నటిస్తుండడం ఆమెకు చాలా అనందంగా ఉంది.

శ్రుతి హాసన్ మొదటి సారి ఎన్.టి.ఆర్ తో జోడీ కడుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ‘ హరీష్ సినిమా సెట్లో మొదటి రోజు, బాగా ఫన్నీగా ఉంది. మళ్ళీ ఈ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని శ్రుతి ట్వీట్ చేసింది. ఎన్.టి.ఆర్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు