కథ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటానంటున్న భామ

Shruti-Haasan
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అలా అని ఈమెకి అంత సులువుగా స్టార్డం రాలేదు.. కెరీర్ మొదట్లో ఎన్నో పరాజయాలు చవి చూసినప్పటికీ పట్టు వదలకుండా ధైర్యంతో ముందుకు సాగింది. అలాంటి శృతికి ఈ సంవత్సరం ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ ‘ నేను సినిమాలను ఎంతో నమ్మకంతో చేస్తాను. నేనెప్పుడూ సినిమాలను నా పాత్రను బట్టి కాకుండా, కథను బట్టి ఎంచుకుంటాను. కథ పక్కాగా ఉంది అంటే అందులో నా పాత్ర కూడా బాగా ఉంటుందని నమ్ముతానంది’. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’, రవితేజ సరసన ‘బలుపు’ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version