జై బోలో శృతి అంటున్న బాలీవుడ్ వాసులు

Shruthi-Hasan
సినిమా రంగంలో ఒక్క హిట్ పడితే అది వారి కెరీర్ నే మార్చేస్తుంది. ప్రస్తుతం శృతిహాసన్ ఆ కోవకే చెందుతుంది. ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం సాధించిన తరువాత ఆమె వెనుతిరిగి చూడట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ సరసన నటిస్తున్న ఈ భామకు బాలీవుడ్ నుండి కుడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి

నిన్న ఈ భామ నటించిన రెండు సినిమాలు (డి-డే మరియు రామయ్యా వస్తావయ్యా) విడుదలై మంచి స్పందనను అందుకున్నాయి. అప్పటినుండి అందరినోటా కేవలం శృతి మాట.. ఆమెకు ఆఫర్లు వెళ్లివిరుస్తున్నాయి. తన తండ్రి ఇమేజ్ నుండి బయటకురావడానికి ఈమె చాలా కష్టపడింది. అతితక్కువ కాలంలో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకుని మిగిలిన హీరోయిన్లకు చమటలు పట్టిస్తుంది

Exit mobile version