మలయాళ సినిమాకి సైన్ చేసిన శ్రియ సరన్

shriya-saran
ఒకప్పటి బిజీ బిజీ హీరోయిన్ హాట్ బ్యూటీ శ్రియ సరన్ చాలా రోజుల తర్వాత ఓ కొత్త సినిమాకి సైన్ చేసింది. తెలుగులో శ్రియ చివరిగా జనార్ధన్ మహర్షి దర్శకత్వంలో వచ్చిన పవిత్ర సినిమాలో కనిపించింది. ప్రస్తుతం శ్రియ విక్రం కుమార్ దర్శకత్వంలో అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’లో నటిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ కనిపించనుంది.

తాజా సమాచారం ప్రకారం శ్రియ ఓ మలయాళ సినిమాకి సైన్ చేసింది. కెఆర్ ఉన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రియ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆండ్రియా జెరేమియా, లాల్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆండ్రియా ఈ సంవత్సరం తెలుగులో తడాఖా, విశ్వరూపం సినిమాల్లో కనిపించింది. ఈ ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీలో శ్రియ, ఆండ్రియా రెడ్డియర్ ఫ్యామిలీకి చెందిన వారిగా కనిపించనున్నారు.

Exit mobile version