ఫస్ట్ లుక్ తో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి శ్రేయ..!

దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి హీరోయిన్ శ్రేయ మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే అందరి స్టార్ హీరోలతోనూ నటించిన ఈ హీరోయిన్ ఇప్పటికీ అదే నటన మరియు అందాన్ని మైంటైన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు తన వయసుకు తగ్గట్టుగా మంచి పాత్రలు చేస్తూ వస్తున్న ఈ హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంది.

దర్శకురాలు సుజనారావు తెరకెక్కిస్తున్న శ్రేయ కొత్త సినిమాకు “గమనం” అనే టైటిల్ ను పెట్టారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈరోజు శ్రేయ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో చాలా సింపుల్ గా ఒక గృహాణిలా శ్రేయ కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని హిందీ మరియు మన దక్షిణాది నాలుగు కీలక భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అంతే కాకుండా ఏఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రమేష్ కరుటూరి, వెంకి పుషాదపు మరియు జ్ఞాన శేకర్ వి.ఎస్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తుండగా ఇతర క్యాస్టింగ్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలో అందిస్తామని తెలిపారు.

Exit mobile version