టీవీ షోలో బాధకి గురైన శ్రేయా ఘోషల్

టీవీ షోలో బాధకి గురైన శ్రేయా ఘోషల్

Published on Jun 23, 2013 4:55 PM IST

Shreya-Ghoshal
తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్న సింగర్, ఆమె గాత్రం ఎంత బాగుంటుందో చూడటానికి కూడా అంతే అందంగా ఉండే శ్రేయా ఘోషల్ కి ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడిన ఆమె కొన్ని రియాలిటీ టీవీ షోస్ కి కూడా జడ్జ్ గా వ్యవహరించింది.

అలాంటి ఓ షోలో శ్రేయా ఘోషల్ కి కాస్త టఫ్ టైం ఎదురైంది. ఈ సమస్యని ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ షోలో ఎదుర్కొన్నారు. ‘ ఈ షోలో నాకు ఈ పార్ట్ నచ్చలేదు. షోలో పాడుతున్న పిల్లలందరూ చాలా బాగా పాడుతున్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నాకు చాలా బాధగా ఉందని’ ఆమె కాస్తా బాధాకరమైన వాయిస్ తో తెలిపింది. ఈ షోలో ఓ బ్రదర్ – సిస్టర్ ని ఎలిమినేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆమె ఎటూ తేల్చుకోలేక కాసేపు అలా కూర్చుండిపోయింది. శ్రేయా ఘోషల్ ఈ సంవత్సరం ‘నాయక’, ‘జబర్దస్త్’ సినిమాల్లో పాటలు పాడింది.

తాజా వార్తలు