ప్రతి రోజూ ఏడ్చేదాన్ని – శ్రద్ద దాస్

shraddha-das
ఇప్పటి వరకూ తన గ్లామర్ తో మాత్రమే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న శ్రద్ద దాస్ కి గ్లామర్ పరంగా అయితే గుర్తింపు దక్కింది కానీ విజయాల విషయంలో మాత్రం ఆ గుర్తింపును దక్కించుకోలేకపోయింది. ఇటీవలే బెంగాలీ సినిమాతో విజయాన్ని అందుకున్న శ్రద్ధ దాస్ ‘రేయ్’ సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ ఇంటర్వ్యూలో శ్రద్దాదాస్ తన కెరీర్ తొలినాళ్ళ గురించి చెబుతూ ‘ కెరీర్ మొదట్లో నేను చేసే సినిమాల పట్ల హ్యాపీగా లేకపోవడం వల్ల రోజూ షూటింగ్ ఐపోగానే బాగా ఏడ్చేదాన్ని. కొత్తలో కొంతమంది ఎలాంటి ఆఫర్ వచ్చినా వదులుకోవద్దు ఓకే చెప్పేసేయ్ అని చెప్పారు కానీ నా పాత్రకి అసలు ప్రాధాన్యత లేని చాలా సినిమాలు వదులుకున్నాను. ఎందుకంటే టాలీవుడ్ లో మనం మొదట ఎలాంటి పాత్రలు చేస్తామో అలాంటి ఆఫర్లే వస్తుంటాయి. దానివల్ల నేను నేర్చుకుంది ఏమిటంటే నాకు నచ్చకపోతే ఏ మాత్రం మొహమాట పడకుండా నో చెప్పేయడమని’ చెప్పింది.

అలాగే ‘రేయ్’ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘రేయ్ లో నాది హీరో పాత్రకి దీటుగా ఉంటుంది. ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ వస్తుందనుకోవడం లేదు. ఈ మూవీలో నా లుక్ ఫైనలైజ్ చెయ్యడం కోసం 300 కాస్ట్యూమ్స్ చెక్ చేసానని’ తెలిపింది.

Exit mobile version