మలయాళంలో శ్రద్ద దాస్

మలయాళంలో శ్రద్ద దాస్

Published on May 13, 2012 11:55 AM IST


ఈ మధ్య కాలంలో శ్రద్ద దాస్ విరామం లేకుండా గడుపుతున్నారు. తెలుగులో ఈ భామ కెరీర్ వేగవంతంగా నడుస్తుంది ప్రస్తుతం వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో “రేయ్” చిత్రంలో నటిస్తుంది ఇది కాకుండా మహేష్ బాబు బావ సరసన మరో చిత్రంలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మలయాళంలో “డ్రాకులా 3డి” అనే చిత్రంలో నటించబోతున్నారు. మలయాళ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు వినయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ఇంగ్లిష్,మలయాళం,తమిళ్ మరియు తెలుగు లో విడుదల కానుంది.”ఈ చిత్రంతో నేను తమిళ్,మలయాళం మరియు ఇంగ్లిష్ లో పరిచయం కాబోతున్న ఈ చిత్రం కోసం అందరు విదేశీ నిపుణులే పని చేస్తున్నారు” అని శ్రద్ద దాస్ ట్విట్టర్ లో చెప్పారు.కొన్ని రోజుల క్రితం ఈ చిత్రంలో మోనాల్ గజ్జర్ కీలక పాత్ర పోషిస్తున్నారు,ప్రభు మరియు నాజర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు అని చెప్పాము. చూస్తుంటే వినయన్ ప్రముఖ నటులను నటింపచేసే ఆలోచనలో ఎటువంటి అవకాశం తీసుకునేట్టు కనపడట్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు