కలెక్షన్స్ తో ఆకట్టుకుంటున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ !

Raju-weds-rambhai

అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డలు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఐతే, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటి రోజు, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 1.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

కాగా ‘బుక్ మై షో’లో గత 24 గంటల్లో ఏకంగా 69.5K టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇక నైజాం ప్రాంతంలో ఈ రోజు మంచి కలెక్షన్స్ ను నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ తో అటెన్షన్ ని అందుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. పూర్తిగా దాదాపు కొత్త నటీనటులు తోనే ఈ సినిమా తెరకెక్కింది.

Exit mobile version