పెళ్లి పుకార్లపై సీనియర్ హీరోయిన్ క్లారిటీ

సీనియర్ హీరోయిన్ మీనా ఈ మధ్య సినిమాల్లో మళ్లీ బాగా యాక్టివ్ అయ్యారు. ఐతే, అవకాశం వచ్చినప్పుడల్లా వ్యక్తిగతం, ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాల్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఐతే, మీనా తన జీవితం గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చింది. అవేంటో ఆమె మాటల్లోనే విందాం. మీనా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను నా పాపతో సంతోషంగా ఉన్నాను. నా పై చాలా వార్తలు వస్తున్నాయి. ఏ హీరో విడాకులు తీసుకొన్నా.. ఆ హీరోతో నా పెళ్లి అని రాస్తున్నారు. అవన్నీ నిజం కావు’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.

మీనా ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కెరీర్‌లో నాకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. నిజానికి పాప పుట్టిన రెండేళ్లకు మలయాళం సినిమా దృశ్యం కోసం నన్ను సంప్రదించారు. పాపను వదిలి వెళ్లలేక తిరస్కరించాను. కానీ కథ నచ్చి ఆ సినిమా చేశాను. ఇప్పుడు కూడా కథలు నచ్చితే మంచి చిత్రాలు చేస్తాను. నేనేమి పరిపూర్ణురాలిని కాదు.. నేను తప్పులు చేయవచ్చు. నీ ప్రస్తుతం మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ మీనా తెలిపింది.

Exit mobile version