విషాదం: ‘కృష్ణ’ విలన్ అనుమానాస్పద మృతి!

విషాదం: ‘కృష్ణ’ విలన్ అనుమానాస్పద మృతి!

Published on May 24, 2025 12:49 PM IST

మన తెలుగు సినిమా దగ్గర నార్త్ నుంచి వచ్చిన విలన్ నటులు చాలా మందే కనిపిస్తారు. ఇలా తెలుగులో తమ కొన్ని సినిమాల తోనే మంచి ఆదరణ ఆఫర్స్ అందుకున్న వారిలో ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కూడా ఒకరు. మెయిన్ గా మాస్ మహారాజా రవితేజ సూపర్ హిట్ చిత్రం “కృష్ణ”లో మెయిన్ విలన్ జక్కాగా అందరికీ బాగా తెలుసు. అలాగే అక్కడ నుంచి అదుర్స్, ఏక్ నిరంజన్ ఇంకా ఎన్నో తెలుగులో ఈ హిందీ నటుడు నటించాడు.

అయితే 54 ఏళ్ల ముకుల్ దేవ్ ఇపుడు కన్ను మూసిన వార్త బాలీవుడ్ లో షాకింగ్ గా మారింది. ముఖ్యంగా తన అకాల మరణానికి కారణం ఏంటి అనేది బయటకి ఇంకా రాకపోవడంతో తన మృతి పట్ల అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇక ఈ విషాద వార్త విన్న బాలీవుడ్ నటీనటులు ముకుల్ పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హిందీ సహా తెలుగులో కూడా మెప్పించిన ఈ నటుడు ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు.కామ్ టీం ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు