విక్రం,జగపతి బాబు ప్రధాన పాత్రలలో కనిపించనున్న చిత్రం “శివ తాండవం” ఈరోజు ఇక్కడ తాజ్ డెక్కన్ లో ఆడియో విడుదల వేడుక జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విక్రం,జగపతి బాబు, ఏ ఎల్ విజయ్, జి వి ప్రకాష్. సి కళ్యాణ్, వి బి రాజేంద్ర ప్రసాద్, వి వి వినాయక్, కె ఎల్ నారాయణ, కె ఎస్ రామారావు, రమేష్ పుప్పళ్ళ, ధనంజయన్ మరియు ఏమి జాక్సన్ హాజరయ్యారు. వి వి వినాయక్ సి.డి. ని ఆవిష్కరించి విబి రాజేంద్ర ప్రసాద్ కి అందించారు. ధనంజయన్ మాట్లాడుతూ ” నాన్న చిత్రం తరువాత తిరిగి ఏ ఎల్ విజయ్ మరియు విక్రంలతో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది తెలుగులో విడుదల చెయ్యడానికి సహకరించిన సి కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు” అని అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ ” ఈ చిత్రాన్ని చిత్రంగానే చూడండి పర్సనల్ గా తీసుకోకండని నా అభిమానులకి మనవి చేస్తున్నాను ఈ కథలో నా పాత్ర మరియు ఈ బృందంతో కలిసి పని చెయ్యడం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు. విక్రం మాట్లాడుతూ “ఈ చిత్రానికి నిజమయిన హీరో ఏ ఎల్ విజయ్ ఈ చిత్రంలో నా ప్రదర్శనకన్నా దర్శకుడి ప్రతిభ ఎక్కువగా కనిపిస్తుంది” అని అన్నారు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కెరీర్ లో ఇది 25వ చిత్రం. ఈ చిత్రంలో విక్రం,జగపతి బాబు, అనుష్క, ఏమి జాక్సన్ మరియు లక్ష్మి రాయి లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “శివ తాండవం” తెలుగు మరియు తమిళంలో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.