అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’ నవంబర్ 14న రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించగా, అప్పట్లో ఈ చిత్రం చేసిన సెన్సేషన్ మామూలుది కాదు. ఇండియన్ సినిమాలో ట్రెండ్ సెట్టర్‌గా శివ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా రీ-రిలీజ్‌తో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇక ఈ సినిమాకు పాతికేళ్ల తర్వాత కూడా ఎలాంటి క్రేజ్ తగ్గలేదు. దీనికి సాక్ష్యంగా ఈ చిత్రం రీ-రిలీజ్ తొలిరోజున వసూలు చేసిన కలెక్షన్స్. శివ రీ-రిలీజ్ తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.2.5 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
కాగా, ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు పోటీగా శివ రీ-రిలీజ్ కలెక్షన్స్ ఉండటం గమనార్హం. ఇక శివ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించగా ఇళయరాజా సంగీతం అందించారు.


