షిర్డి వెళ్తున్న శిరిడి సాయి చిత్ర యూనిట్

షిర్డి వెళ్తున్న శిరిడి సాయి చిత్ర యూనిట్

Published on Jul 24, 2012 12:14 PM IST


యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం “శిరిడి సాయి”. ఇప్పటికే దాదాపు ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో తెరకెక్కించవలసిన కొన్ని సన్నివేశాలను షిర్డిలో తీయనున్నారని ఇది వరకే తెలిపాము. రేపు శిరిడిలో జరగబోయే చివరి రోజు షూటింగ్ కి నాగార్జున మరియు ఈ చిత్ర టీం ఈ రోజు శిరిడి వెళ్తున్నారని తాజా సమాచారం. శ్రీ హరి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మరియు శ్రీకాంత్, శరత్ బాబు మరియు సాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భక్తిరస చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిచిన ఈ చిత్ర ఆడియో ని జూలై ౩౦ న విడుదల చేయనున్నారు. ఎ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు