అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా అభిజీత్, సుధాకర్, కౌషిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజయ్, శ్రీరామ్ కొత్త తరాలు పరిచయం కానున్నారు. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్ర ఆడియో జూలై 27న విడుదలకు సిద్ధమవుతుండగా స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల కలిసి న్నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.