ఈ నెలలో విడుదలకానున్న శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’

ఈ నెలలో విడుదలకానున్న శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’

Published on Nov 7, 2013 3:50 AM IST

yemito-ee-maya
మన ఇండస్ట్రిలో వున్న టాలెంటెడ్ నటులలో శర్వానంద్ ఒకరు. కమర్షియల్ గా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న తన రెండు సినిమాలు ఈ నెలలో విడుదలకానున్నాయి

అందులో ఒక సినిమా ‘సత్య 2’ ఈ నెల 8 నా విడుదలవుతుండగా మరో సినిమా ‘ఏమిటో ఈ మాయ’ సినిమా ఇదే నెలలో 29నా విడుదలకానుంది. ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్ లో శర్వానంద్ సరసన నిత్య మీనన్ హీరోయిన్. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలొ ఒకేరోజు విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో త్వరలో మార్కెట్ లోకి రానుంది.

ఈ సినిమాకు చరణ్ దర్శకుడు. జి.వి ప్రకాష్ సంగీత దర్శకుడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు

తాజా వార్తలు