ఓనమాలు డైరెక్టర్ తో కలిసి పనిచేయనున్న శర్వానంద్?

ఓనమాలు డైరెక్టర్ తో కలిసి పనిచేయనున్న శర్వానంద్?

Published on Dec 1, 2013 12:05 PM IST

sharwanad-kranti-madhav

రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య 2 లో కనిపించిన శర్వానంద్ తాజాగామారో సినిమాకి సైన్ చేసాడు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ కాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి సైన్ చేసాడు. క్రాంతి మాధవ్ గత సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ తో ‘ఓనమాలు’ సినిమా తీసాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటనకి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఈ సినిమా విమర్శకుల ప్రశంశలను అందుకుంది.

శర్వానంద్ – క్రాంతి మాధవ్ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ ఈ సినిమాని కెఎస్ రామారావు నిర్మిస్తాడని అంటున్నారు. ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘అమ్మ చెప్పింది’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శర్వానంద్ చాలా సెలెక్టివ్ గా కథలని ఎంచుకున్తున్నాడు.

ఇది కాకుండా శర్వానంద్ త్వరలో ‘ఏమిటో ఈ మాయ’ సినిమాలో నటిస్తున్నాడు. చేరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవి కిషోర్ నిర్మాత.

తాజా వార్తలు