క్రాంతిమాధవ్ సినిమాలో క్రీడాకారుడిగా శర్వానంద్

Sharwanand-and-Nithya-Menon

రానున్న క్రాంతి మాధవ్ సినిమాలో శర్వానంద్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నిత్యామీనన్ హీరోయిన్. కె ఏ వల్లభ నిర్మాత. కె.ఎస్ రామారావు సమర్పకుడు

ఒక ఇంటర్వ్యూలో రామారావుగారు మాట్లాడుతూ “నేను స్క్రిప్ట్ వినగానే కధతో ప్రేమలోపడ్డాను. మాకు అద్భుతమైన బృందం దొరికింది. మా బ్యానర్ చరిత్రలో మంచి చిత్రంగా నిలిచిపోనుందని, ఈ సినిమాలో శర్వానంద్ క్రీడాకారుడు. కానీ ఇది ఒక సెన్సిటివ్ ప్రేమకధగా నిలవనుందని” తెలిపాడు. ఇలాంటి సినిమాలు ఎప్పుడో గానీ రావని దర్శకుడిని హీరో పొగిడాడు

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. సాయి మాధవ్ బుర్రా సంబాషణలను అందించాడు. గోపీ సుందర్ సంగీతదర్శకుడు. ఆగష్టులో ఈ సినిమా మనముందుకు రానుంది

Exit mobile version