ఏమిటో ఈ మాయ అంటున్న శర్వా – నిత్యా


ఒక మూస తరహా పాత్రలకే పరిమితమై పోకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న శర్వానంద్ మరియు మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరూ విడివిడిగా తెలుగులో చేసిన ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘అందరి బంధువయ’, ‘జర్నీ’, ‘అలా మొదలైంది’, ‘ఇష్క్’ మరియు ‘ఉరిమి’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాటి వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు మరియు తమిళ భాషల్లో ‘ఏమిటో ఈ మాయ’ అనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి తమిళంలో నటుడు మరియు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చేరన్ దర్శకత్వం వహించనున్నారు. చేరన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 22న సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version